PrayanamTheJourney

భావాల పల్లకిలో ప్రయాణ గీతిక……

ఆగిపో బాల్యమా…

బోసి నవ్వులతో మొదలైన బాల్యం,
ఇప్పుడు తిరిగి చూస్తే ఒక అందమైన జ్ఞాపకం.

వెన్నెలలో అమ్మ చేతి గోరుముద్దలు,
నాన్న పలుకుల్లో వెదజల్లిన ప్రేమ కాంతులు……
నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యల గారాభాలు,
సహోదరులుతో పెట్టుకున్న గిల్లికజ్జాలు…
ఆత్మీయుల కలయిక కోసం ఎదురు చూపులు….


ఆ ఇంటి ఆవరణలో ఆడిన అడుగులు,
కన్నుల చెమ్మతో మెరిసిన చిరునవ్వులు…
ఓ క్షణమైనా,
ఆ బాల్యపు దారుల్లో మళ్లీ నడవలిగితే ఎంత బాగుంటుందో!

ఆ బాల్యాన్ని కాలం దూరం చేసినా,
ఆ బొమ్మల ప్రపంచం ఇంకా లోపలే ఊగిసలాడుతుంది…