అనుకున్నవన్నీ అవవు,
ఆశించిన ప్రతి దారి సాఫీగా సాగదు.
అనుకున్న కలలు విరిగిపోవచ్చు,
మనసు వేసిన మార్గాలు మూసుకుపోవచ్చు.
అయినా, అవి నెరవేరకపోవడం లోనే
కొత్త దారులు తెరుచుకుంటాయి.
కొత్త అవకాశాలు ఎదురవుతాయి.
బ్రతుకెంత కఠినంగా మలచినా,
ఎలా ఉండాలో నిర్ణయించేది మన మనసే.
బాధల్లోనూ బలాన్ని,
అడ్డంకుల్లోనూ దారిని,
చీకటిలోనూ వెలుగుని వెతికేది నువ్వే.
అనుకున్నట్లు జరగకపోవడమే
జీవితం ఇచ్చే కొత్త ఆహ్వానం.
బ్రతుకెలా ఉండాలో…
ఎలా మలచాలో…
తీర్మానించేది నువ్వే.