PrayanamTheJourney

భావాల పల్లకిలో ప్రయాణ గీతిక……

Telugu

  • నీలి ఆకాశం కింద రంగుల పూలమాల కట్టినట్లు,ప్రకృతి తనని తాను అలంకరించుకుంటున్న వేళ.చల్లటి గాలి తాకిడిలో వినిపించే మధుర గానాలు,మనసును మైమరపించే ప్రకృతి రాగాలు. చెట్ల నీడల్లోంచి జారే వెచ్చని కిరణాలు,సూర్యాస్తమయం వెలుగులో మెరిసే ఆకాశపు అద్భుతాలు.ప్రతి అడుగు వేసిన దారిలో,మాటలకందని ప్రకృతి మాధుర్యం. ఆకుల వర్షంలా జారే రంగుల క్షణాలు,చూపు తగిలిన ప్రతిచోట కొత్త చిత్రమాలికలు.ప్రకృతి ఇంత అందంగా పలకరిస్తుంటే,మనసు సంతోషపు అలలలో తేలిపోతుంది. Read more

  • అనుకున్నవన్నీ అవవు,ఆశించిన ప్రతి దారి సాఫీగా సాగదు.అనుకున్న కలలు విరిగిపోవచ్చు,మనసు వేసిన మార్గాలు మూసుకుపోవచ్చు. అయినా, అవి నెరవేరకపోవడం లోనేకొత్త దారులు తెరుచుకుంటాయి.కొత్త అవకాశాలు ఎదురవుతాయి. బ్రతుకెంత కఠినంగా మలచినా,ఎలా ఉండాలో నిర్ణయించేది మన మనసే.బాధల్లోనూ బలాన్ని,అడ్డంకుల్లోనూ దారిని,చీకటిలోనూ వెలుగుని వెతికేది నువ్వే. అనుకున్నట్లు జరగకపోవడమేజీవితం ఇచ్చే కొత్త ఆహ్వానం.బ్రతుకెలా ఉండాలో…ఎలా మలచాలో…తీర్మానించేది నువ్వే. Read more

  • పరుగులు తీస్తున్న ఈ జీవన రహదారిలో,ఒక్క క్షణం ఆగిపోదాం. ప్రపంచాన్ని మ‌రచి ఆగిన ఆ క్షణాల్లోనే,మనకు మనం దగ్గరవుతాం. చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతికేద్దాం,ఆకులు రాలుతూ చేసే సందడులు,వాన చినుకుల అల్లర్లు,తీయని గాలి పలకరింపులు,సూర్యాస్తమయపు రంగుల లోకాలు,ఇలా చిన్న చిన్న ఆనందాల్ని ఆస్వాదిద్దాం. జీవితం అనేదికేవలం పరిగెత్తడమే కాదు,ఆగి చూసిన ఆ క్షణాల్లోనేదాని అసలైన అందం దాగి ఉంటుంది. Read more

  • స్వేచ్ఛ…

    ఆలోచించడానికి స్వేచ్ఛ,అభిప్రాయాన్ని వెలిబుచ్ఛడానికి స్వేచ్ఛ,పరిమితులు లేకుండా కలలు కనడానికి స్వేచ్ఛ,ఆనందంగా ఉండటానికి స్వేచ్ఛ,స్వేచ్ఛగా జీవించటానికి స్వేచ్ఛ. ఎలాగోలా జీవించడానికి నువ్వు అవసరం లేకపోవచ్చు,కానీ విలువలతో జీవించడానికి నువ్వు ఎంతో అవసరం. Read more

  • బోసి నవ్వులతో మొదలైన బాల్యం,ఇప్పుడు తిరిగి చూస్తే ఒక అందమైన జ్ఞాపకం. వెన్నెలలో అమ్మ చేతి గోరుముద్దలు,నాన్న పలుకుల్లో వెదజల్లిన ప్రేమ కాంతులు……నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యల గారాభాలు,సహోదరులుతో పెట్టుకున్న గిల్లికజ్జాలు…ఆత్మీయుల కలయిక కోసం ఎదురు చూపులు…. ఆ ఇంటి ఆవరణలో ఆడిన అడుగులు,కన్నుల చెమ్మతో మెరిసిన చిరునవ్వులు…ఓ క్షణమైనా,ఆ బాల్యపు దారుల్లో మళ్లీ నడవలిగితే ఎంత బాగుంటుందో! ఆ బాల్యాన్ని కాలం దూరం చేసినా,ఆ బొమ్మల ప్రపంచం ఇంకా లోపలే ఊగిసలాడుతుంది… Read more

  • ఓ అందమైన కష్టమా,నీ రాక నిశ్శబ్దంగా మొదలైనా,నీవు ఎక్కువకాలం ఉండలేవని తెలిసినా,నిన్ను జయించలేరని నువ్వు గర్విస్తున్నా, నిన్ను వదిలి,గమ్యాన్ని వెతుకుతూ,ప్రయాణాన్ని మొదలుపెట్టిన ధైర్యాన్ని అడుగు నువ్వు ఎలా కనిపించావో… అక్కడక్కడా నీ స్నేహితులు పలకరించే ప్రయత్నం చేసినా,“నిన్ను మేము జయించాం” అని మాటల్ని విసిరినా,నవ్వుతూ ముందుకు సాగిన పట్టుదలను అడుగు నీవు ఎలా కనిపించావో… ప్రతి కష్టం తుది గమ్యం కాదని,ఒక మార్గమే అని,మనలోని బలాన్ని గుర్తు చేస్తూ,నీ పేరుతో ఓ అధ్యాయాన్ని రాయడానికి వచ్చిన…ఓ అందమైన Read more

  • జీవితంలో ఎదురొచ్చే ప్రశ్నలకుప్రతిసారీ ఓ జవాబు అవసరమా?లేదేమో… జరిగేది ముందే తెలిసుంటే,జాగ్రత్తలు మన దారి చూసేవి కదా…కానీ ఎందుకు తెలియదు ?బహుశావిధిరాత రాసిన అక్షరాల వంకనేమో… కన్నీటి వెనుక దాగిన కోణాలు,నవ్వుల వెనుక మిగిలిన బాధలు,అన్నీ ప్రశ్నలే…ఆ ప్రశ్నలకి సమాధానం అవసరమా?లేదేమో… ప్రతి ప్రశ్నకు ఒక కథ ఉంది,అది మన కథ అయినా,మనకు తెలియని వేదన అయినా…ఆ ప్రశ్నలు మనతోనే ఉంటాయి,నిశ్శబ్దంగా మనల్ని చూస్తూనే ఉంటాయి ప్రతి ప్రశ్నకు జవాబు ఉండకపోవచ్చు,కానీ ప్రతి ప్రశ్న మనలో మార్పును Read more

  • కడలి

    నిశ్శబ్దంలో ప్రయాణిస్తున్న వేళ,భావాల అలలు వినిపించాయి.మౌనాన్ని తడిమిన శబ్దం,నా లోతుల్లో ఉదయించిన క్షణం. అది ఊహల తాకిడి కాదు,అది కదలిక.ఒక కడలి.నాలో మొదలైన ఓ భావ ప్రయాణం. Read more